పూర్వాషాఢ రెండో పాదములో పుట్టిన జాతకులైతే..!?

FILE
పూర్వాషాఢ నక్షత్రం రెండో పాదములో పుట్టిన జాతకులు బంగారములో పొదిగించిన వజ్రపు ఉంగరాన్ని ధరించడం ద్వారా సుఖసంతోషాలు చేకూరుతాయని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు. ఈ జాతకులకు జన్మించినప్పటి నుంచి 15 ఏళ్ల వరకు శుక్ర మహర్ధశ కావడంతో వజ్రపు ఉంగరాన్ని బంగారముతో పొదిగించుకుని ధరించడం శ్రేయస్కరం.

అలాగే 15-21వ సంవత్సరముల వరకు రవి మహర్ధశ కావున కెంపును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం మంచిది. ఇంకా పూర్వాషాఢ రెండో పాదములో జన్మించిన జాతకులకు 21-31 వరకు చంద్ర మహర్ధశ కావున ముత్యమును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం ద్వారా ఉన్నత చదువులు, పదవోన్నతులు చేకూరుతాయి.

అలాగే 31-38 సంవత్సరము వరకు ఈ జాతకులకు కుజ మహర్ధశ కావడంతో పగడమును బంగారములో పొదిగించుకుని ధరించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయని రత్నాల శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇదేవిధంగా 38-56వరకు రాహు మహర్ధశ కావడంతో గోమేధికమును వెండిలో పొదిగించుకుని మధ్యవేలుకు ధరించాలి. 56-72 సంవత్సరాల వరకు గురు మహర్ధశ కావడంతో కనకపుష్యరాగమును బంగారముతో పొదిగించుకుని చూపుడు వేలుకు ధరించగలరు.

అలాగే 72 నుంచి 99 సంవత్సరముల వరకు పూర్వాషాఢ నక్షత్రము రెండో పాదములో పుట్టిన జాతకులకు శని మహర్దశ కావడంతో నీలమును వెండితో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించాలని రత్నాల శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.

ఇకపోతే.. ఈ జాతకులకు బుధవారం అదృష్టకరమైన రోజు. కానీ వీరికి సోమ, మంగళ, గురువారాలు అశుభం. అదృష్ట సంఖ్యల విషయానికొస్తే.. పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టిన జాతకులకు 3 అనే సంఖ్య అనుకూలిస్తుంది. ఇంకా 3, 12, 21 వంటి సంఖ్యలు సాధారణ ఫలితాలనిస్తాయి. కానీ 5, 6 అనే సంఖ్య వీరికి కలిసిరావు.

అలాగే నలుపు, తెలుపు, నీలం రంగులు ఈ జాతకులకు కలిసివస్తాయి. ఇందులో నలుపు రంగు కొంతైనా కలిసిన దుస్తులను ధరించడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయని రత్నాల శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి