మీకు చక్కెర వ్యాధి ఉందా? పగడం ధరించండి

సాధారణంగా గ్రహాలు, వాటి తారా బలాల చేత జాతకులు సుఖ దుఃఖాలను అనుభవిస్తారని జోతిష్య నిపుణులు అంటూ ఉంటారు. మనమందరం సుఖ సంతోషాలతో జీవించాలని కోరుతూ... వివిధ రకాలైన పూజలు పునస్కారాలు, దైవారాధనలు చేస్తుంటాం.

అలాగే.. అదృష్టం మీ వెంటే ఉండాలంటే.. నవరత్న ఉంగరాలను ధరించడం మంచిదని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు. ఈ నవరత్న ఉంగరాలను ధరించడం ద్వారా పొందే ఫలితాలేంటి..? ఏయే రత్నాన్ని, ఎలాంటి వ్యక్తులు ధరించాలో తెలుసుకుందామా..?

వజ్రపుటుంగరాన్ని రాజకీయవేత్తలు, ఆకర్షణ లోపమువారు, స్త్రీలోలురు ధరించాలి. అలాగే.. చక్కెర వ్యాధితో బాధపడుతున్న వారు వజ్రమునుగాని, పగడమునుగానీ ధరించినట్టయితే వ్యాధి కొంత మేరకు నయం అవుతుందని రత్నాల శాస్త్రం చెబుతోంది.

నీలం రాయి కలిగిన ఉంగరాన్ని దారిద్ర్యముతో బాధపడుతున్న వారు, కీళ్ళ నొప్పులు, జీర్ణకోశ వ్యాధులు, కుసుమ వ్యాధులు కలిగిన వారు ధరించడం శ్రేయస్కరం. వైఢూర్యానికి విష జంతు బాధా నివారణ శక్తి ఉందని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు. అందుచేత ప్రతివాద భయము తొలగి పోయేందుకు, సంతాన లోప నివారణకు వైఢ్యూర్యాన్ని ఉపయోగించడం మంచిది.

గోమేధికమును నరాల సంబంధిత వ్యాధులతో బాధపడే వారు ధరించవచ్చు. వ్యాపారములందు రాణించి, లాభాలను పొందలేని వారు గోమేధికమును ధరించాలి. దేవభక్తి, సూక్ష్మజ్ఞానము కలగాలంటే పుష్యరాగ ఉంగరాన్ని ధరించడం చాలా మంచిది.

పగడమును రాజకీయ వేత్తలు, శత్రుభయంతో బాధపడుతున్నవారు, దీర్ఘవ్యాధి గలవారు ధరించాలని రత్నాల శాస్త్రం చెబుతోంది. అయితే ముత్య రత్నాన్ని మాత్రం ఏ సమయంలోనైనా, ప్రతి ఒక్కరూ ధరించవచ్చు.

కుటుంబం సుఖ సంతోషాలు కరువైన వారైతే సోమవారం రోజున ముత్యముతో పొదిగించిన ఉంగరాన్ని ధరించడం మంచిది. సోమవారం నాడు ముత్యాన్ని ధరించడం ద్వారా ఈతిబాధలు దరి చేరవని రత్నాల శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి