మూడో సంఖ్య వారి జాతక విశేషాలు

బుధవారం, 2 ఏప్రియల్ 2008 (15:12 IST)
WD
ఏ సంవత్సరమునైన, ఏ మాసంలోనైనా 3, 12, 21, 30 తేదీలలో జన్మించిన వారు 3వ సంఖ్య వారుగా ఉందురు. ఈ 3వ సంఖ్య అధిపతి గురువు. పునర్వసు, విశాఖ, పూర్వాచక్ర నక్షత్రములకు కూడా గురువు అధిపతి. త్రికాలములు, త్రిమూర్తులు కూడా ఈ మూడవ సంఖ్యకు సంబంధించినవారు. ఈ గురువుకి బృహస్పతి అనే పేరు ఉంది. ఈ గురువు దేవతలకు గురువు. విద్యాకారకుడు. ధనకారకుడు అగుటవలన గురువును నవగ్రహములలో మంచి స్థానం ఇవ్వబడింది.

ఇందు జన్మించిన వారు ఎత్తుగాను, మంచి ఆకర్షణీయమైన కనులు గలవారు, పెద్దదైన నదురు, చక్కని కనుపాపలు, త్వరితగతిన తెల్లబడు జుట్టు, అనగా చిన్న వయస్సునందు తెల్లబడు జుట్టు గలవారు, చక్కని శరీర ఛాయ గలవారు, ధృఢమైన శరీరము ఎదుటి వారిని ఆకర్షించే స్వరం, వీరి వర్ఛస్సు ఎదుటి వారిని ఆకర్షించేటట్లుగా ఉండగలదు.

వీరి ముఖమునందు వీరి మనోభావము ఎక్కువగా కానవస్తుంది. ఆర్థిక విషయంలో చాలా ఆశగలవారు అయినా ధనం మాత్రం అధికంగా ఖర్చులు చేయువారు ఉందురు. అందరియందు ప్రేమ, అనురాగం, గలవారు, సరదాగా ఉండువారు, మంచి సలహా, సహాయం అందించువారు, వీరికి మంచి స్నేహబృందాలు అధికంగా ఉండగలవు. ప్రతివిషయాన్ని అధికంగా ఆలోచించి తరచి చూసే స్వభావం, సలహాలు ఇచ్చుటలో సిద్దహస్తులు అనే చెప్పాలి. ప్రతి విషయంలో ఎదుటివారికి అర్ధం అగునట్లు విశదీకరించి తెలుపు స్వభావము గలవారు, విద్యావృత్తులలో వీరికి ప్రత్యేక స్థానం ఉండగలదనే చెప్పాలి.

ఉద్యోగ రంగంలో ఒకరిని ఆశ్రయించి ఉండటం, స్వతంత్ర్య జీవనం గడుపుటకు వీరికి అధికమైన ఇష్టం. రాజకీయాలలో సంఘంలో వీరు మంచి పేరు, ఖ్యాతి పొందగలరు. ఎవరయినా వీరి సలహా పొందినచో చాలా అభివృద్ధికి ఆస్కారం ఉండగలదు. వీరికి నీతి, నియమాలు అధికంగా ఉండగలదు. భక్తి శ్రద్ధలు కూడా అధికం. వీరు అంతగా శ్రమ పడటం ఉండదనే చెప్పాలి. వీరు శ్రమపడిన వెంటనే మరిచిపోవు స్వభావము గలవారుగా ఉందురు. ప్రతి సమస్యను తెలివిగా ఎదుర్కొనే స్వభావము వీరికి ఉండగలదు. ధర్మ కార్యక్రమమము యందు, దైవ, ఆధ్యాత్మిక చింతనపట్ల అధికమైన మక్కువ ఉండగలదు.

వీరు దేవాలయములకు ట్రస్టులుగా ఉండగలరు. మధ్యవర్తిత్వం, సంగీతం, సాహిత్య సత్కార్యములందు అధికమైన ఇష్టం గలవారుగా ఉందురు. ప్రసంగాలపై వీరికి మక్కువ ఎక్కువ. వీరిలో ఎక్కువ భాగం రచనా రంగంలో వారుగా ఉందురు.

ప్రసంగాలపై వీరికి మక్కువ ఎక్కువ. వీరిలో ఎక్కువ భాగం రచనా రంగంలో వారుగా ఉందురు. వీరికి మాట పట్టుదల అధికంగా ఉండగలదు. ఏదైనా చెప్పిన ఎదుటివారు విన్నారా..? లేదా..? అనే అనుమానం అధికంగా ఉండగలదు. అందువలన వీరు చెప్పిందే చెప్పడం జరుగుతుంది. ఇక వైవాహిక జీవితం... ఆర్థిక విషయాల స్థితిగతులు ఎలా ఉంటాయన్నది వచ్చేవారం....

వెబ్దునియా పై చదవండి