మేషలగ్నంలో జన్మించిన జాతకుల లగ్నాధిపతి కుజుడు కేంద్ర స్థానంలో సంచరిస్తే పగడమును వెండిలో పొదిగించి ఉంగరవు వ్రేలుకు ధరించడం శుభ ఫలితాలనిస్తుందని రత్నాల శాస్త్రం చెబుతోంది. అదేవిధంగా మేషలగ్న జాతకులకు పంచమాధిపతి రవి గ్రహం కావడంతో, రవి గ్రహం కేంద్రంలో ఉన్నట్లైతే కెంపును వెండిలో పొదిగించి ఉంగరపు వ్రేలుకు ధరించాలి.
ఇకపోతే ఈ లగ్నకారులకు భాగ్యాధిపతి గురు గ్రహం కావడంతో, జాతక చక్రములో గురువు కోణములో ఉన్నట్లైతే కనపుష్యరాగంను చూపుడు వ్రేలుకు ధరించాలి. గురువు కర్కాటకలో వున్నచో కనక పుష్యరాగం ధరించడం శ్రేయస్కరమని రత్నాల శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
మేషలగ్న కారులు ధరించకూడని రత్నాలు: మేషలగ్న కారులకు శుక్రుడు ద్వితీయ సప్తమాధిపత్యం వహించడంతో... మారక స్థానములు కావున వజ్రమును ధరించరాదని రత్నాల శాస్త్రం పేర్కొంటుంది. అదే విధంగా... బుధుడు తృతీయ షష్ఠమాధిపతి కావడంతో రెండు పాపస్థానములు అగుటచే జాతిపచ్చ ధరించడం అశుభమని రత్నాల శాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు. శని దశమ, ఏకాదశపతి కావడంతో నీలమును కూడా ధరించరాదని వారు అంటున్నారు.