రత్నాలను ధరించాలనుకుంటున్నారా?

నవగ్రహాలలో సూర్యుడికి కెంపు, చంద్రుడికి ముత్యం, కుజుడికి పగడం, రాహువుకు గోమేధికం, గురువుకు పుష్యరాగం, శనికి నీలం, బుధుడికి పచ్చ, శుక్రుడికి వజ్రం, కేతువుకు వైఢూర్యం అన్వయిస్తాయి. ఆ రత్నాలను ధరించటంలో వివిధ పద్ధతుల్ని అనుసరిస్తున్నారు.

జన్మరాశికిగానీ, జన్మ లగ్నానికిగానీ ఆధిపత్యం గల గ్రహానికి ఏ రత్నం వర్తిస్తుందో ఆ ధరించటం ఒక సాంప్రదాయమైతే... ఏ గ్రహదశ నడుస్తుందో ఆ గ్రహానికి అన్వయించే రత్నాన్ని ధరించటం మరో పద్ధతి.

రత్నాలు ధరించేందుకు బలమైన కారణాలు ఉండాలి. అవేంటంటే.... రోగపీడ, శత్రుభయం, రుణపీడ, ప్రమాదభీతి, ఆర్థిక సమస్యలు, దాంపత్యంలో కష్టాలు, వివాహం కాకపోవడం, మనోవ్యాకులత, రాజభీతి-ప్రభుత్వదండన, నిరుద్యోగం, సంతానం లేకపోవటం, భూత పిశాచ బాధలు, విద్యలో పరాజయం, మరణభీతి, లిటిగేషన్లు, పనులకు ఆటంకాలు మొదలైనవి.

ఇలాంటి చిక్కుల నుండి తప్పించుకుని పురోగతి సాధించటానికి రత్నం ఉపయోగపడుతుంది. జ్యోతిష రత్న శాస్త్రాలలో అనుభవం గల ప్రముఖుల్ని సంప్రదించి వారి సలహాలపై ఎలాంటి రత్నం ధరించటమైనా మంచిదని రత్నాల శాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు.

వెబ్దునియా పై చదవండి