అశ్విని నక్షత్రం 1వ పాదం అంటే.. మేషరాశిలో జన్మించిన జాతకులకు ఏడో సంవత్సరం వరకు కేతు మహర్దశ జరగడంతో వైఢూర్యాన్ని చిటికెన వ్రేలుకు ధరించడం శుభమని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు.
అలాగే నవగ్రహాల ప్రభావమును బట్టి అశ్విని 1వ పాదంలో జన్మించిన జాతకులు ఏయే సంవత్సరములో ఎలాంటి రత్నాన్ని ధరించాలని రత్నాల శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు.
వాటిలో కొన్ని మీ కోసం.. 7 సంవత్సరము నుంచి 27వ సంవత్సరము వరకు అశ్విని ఒకటో పాదంలో పుట్టిన జాతకులకు శుక్ర మహర్దశ కావున ఆ వయస్సులో వజ్రమును బంగారముతో ఉంగరపు వ్రేలుకు ధరించడం శ్రేయస్కరం.
అదేవిధంగా... 27 సంవత్సరము నుంచి 33 సంవత్సరము వరకు రవి మహర్దశ కావున కెంపును ఉంగరపు వ్రేలుకు ధరించడం మంచిది.
అలాగే 33 సంవత్సరము నుంచి 43సం. వరకు చంద్ర మహర్దశ కావున ముత్యమును వెండితో పొదిగించి ఉంగరపు వ్రేలుకు ధరించాలి.
ఇకపోతే.. 43 సంవత్సరము నుంచి 50 వయస్సు వరకు కూడా మహర్దశ కావున పగడమును బంగారముతో పొదిగించి ఉంగరపు వ్రేలుకు ధరించడం ద్వారా వ్యాపారాభివృద్ధి చేకూరుతుందని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు.
50 సంవత్సరము నుంచి 68వ సంవత్సరము వరకు రాహు మహర్దశ కావున గోమేధికమును వెండితో పొదిగించి మధ్య వ్రేలుకు ధరించడం చేయాలి.
68 సంవత్సరము నుంచి 84వ సంవత్సరము వరకు అశ్విని ఒకటో పాదములో పుట్టిన జాతకులకు గురు మహర్దశ కావున కనక పుష్యరాగమును బంగారముతో పొదిగించి చూపుడు వ్రేలుకు ధరించడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయని రత్నాల శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.