ఉత్తర నక్షత్రం నాల్గో పాదములో పుట్టిన జాతకులైతే..!

FILE
ఉత్తర నక్షత్రం నాలుగో పాదములో పుట్టిన జాతకులు జన్మించిన ఒక సంవత్సరం నుంచి ఆరు నెలల వరకు రవి మహర్దశ కావున కెంపును వెండిలో ఉంగరపు వేలును ధరించగలరు. ఒక సంవత్సరము ఆరు నెలల వయస్సు నుంచి 11 సంవత్సరాల ఆరు నెలల వయస్సు వరకు చంద్ర మహర్దశ కావున ముత్యమును వెండిలో ఉంగరము వేలుకు ధరించగలరు.

11 సంవత్సరాలు ఆరు నెలల వయస్సు నుంచి 18 సంవత్సరాల ఆరు నెలల వరకు కుజ మహర్ధశ కావున పగడమును బంగారములో ఉంగరపు వేలుకు ధరించడం మంచిది. 18 సంవత్సరములు ఆరు నెలల వయస్సు నుంచి 36 సంవత్సరాల ఆరు నెలల వరకు రాహు మహర్దశ కావున గోమేధికమును వెండిలో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించడం శ్రేయస్కరం.

30 సంవత్సరముల ఆరు నెలల వయస్సు నుండి 32 సంవత్సరముల ఆరు నెలల వరకు గురు మహర్ధశ కావున కనకపుష్యరాగమును బంగారములో చూపుడు వేలుకు ధరించగలరు.

52 సంవత్సరములు ఆరు నెలల వయస్సు నుంచి 71 సంవత్సరముల ఆరు నెలల వరకు శని మహర్ధశ కావున నీలమును వెండిలో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించడం మంచిదని రత్నాల శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి