కృత్తిక రెండోపాద జన్మకారుల రత్నధారణ!

శుక్రవారం, 5 సెప్టెంబరు 2008 (20:02 IST)
కృత్తిక నక్షత్రం రెండోపాదంలో పుట్టిన వారికి నాలుగు సంవత్సరాల ఆరు నెలల వరకు రవిమహర్దశ ప్రవేశించడంతో కెంపును వెండితో చేసుకున్న ఉంగరాన్ని ఉంగరపు వ్రేలుకు ధరించినట్లైతే మంచి ఫలితాలు దరిచేరుతాయని రత్నాల నిపుణులు చెబుతున్నారు.

నాలుగు ఏళ్ళ ఆరు నెలల నుండి 14 సంవత్సరాల ఆరు నెలల వరకు చంద్రమహర్దశలో సంచరించడంతో ముత్యాన్ని వెండితో పొదిగించి ఉంగరపు వ్రేలుకు ధరించాలని శాస్త్రకారులు తెలుపుతున్నారు.

14 సంవత్సరాల ఆరు నెలల నుండి 21 సంవత్సరాల ఆరు నెలల వరకు కుజమహర్దశ ప్రభావం ఉండటంతో... పగడాన్ని బంగారంలో పొదిగంచి ఉంగరపు వ్రేలుకు ధరించుకోవాలని రత్నాల శాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు.

21 ఏళ్ళ ఆరు నెలల నండి 39 సంవత్సరాల ఆరు నెలల వరకు రాహుమహర్దశ సంచారం కారణంగా గోమేధికమును వెండిలో పొదిగి మధ్య వ్రేలుకు ధరించవచ్చునని శాస్త్రజ్ఞులు ప్రేర్కొన్నారు.

39 సంవత్సరాల ఆరు నెలల నుండి 55 ఏళ్ళ ఆరు నెలల వరకు గురుమహర్దశ జరగడంతో పుష్యరాగమును బంగారంతో పొదిగించి చూపుడు వ్రేలుకు ధరించుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి.

55 సంవత్సరాల ఆరు నెలల నుండి 74 ఏళ్ళ ఆరు నెలల వరకు శనిమహర్దశ ఉండటంతో... నీలమును వెండిలో పొదిగించుకుని వ్రేలుకు ధరించుకున్నట్లైతే మంచి ఫలితాల్నిస్తాయని రత్నశాస్త్రకారులు తెలుపుతున్నారు.

74 ఏళ్ళ ఆరు నెలల నుంచి 90 సంవత్సరాల ఆరు నెలల వరకు బుధమహర్దశ సంచరిస్తుండడంతో... పచ్చను బంగారంలో పొదిగించుకుని చిటికెన వ్రేలుకు ధరించుకున్నట్లైతే సత్ఫలితాలనిస్తాయని రత్నశాస్త్రకారులు తెలుపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి