తులారాశి, విశాఖ నక్షత్రములో మూడో పాదములో పుట్టిన జాతకు లు 8 సంవత్సరముల వరకు కనక పుష్యరాగమును బంగారముతో పొదిగించుకుని చూపుడు వేలుకు ధరించడం మంచిదని రత్నాల శాస్త్రం చెబుతోంది. 8 సంవత్సరముల నుంచి 27వ సంవత్సరాల వరకు ఈ జాతకులకు శని మహర్దశ కావడంతో నీలమును వెండితో మధ్య వేలుకు ధరించగలరు.
27-44 సంవత్సరాల వరకు ఈ జాతకులకు బుధ మహర్దశ కావడంతో పచ్చను బంగారముతో పొదిగించుకుని చిటికెన వేలుకు ధరించడం శ్రేయస్కరం. 44 సంవత్సరాల నుంచి 51వ సంవత్సరము వరకు కేతు మహర్దశ కావడంతో వైడూర్యమును వెండితో పొదిగించుకుని చిటికెన వేలుకు ధరించడం ద్వారా శుభఫలితాలుంటాయని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు.
ఇకపోతే.. 51వ సంవత్సరముల నుంచి 71 సంవత్సరాల వరకు ఈ జాతకులపై శుక్ర మహర్దశ ప్రభావముండుటచే వజ్రమును బంగారముతో ఉంగరము వేలుకు ధరించడం మంచిది. 77 సంవత్సరాల నుంచి 87 సంవత్సరాల వరకు చంద్ర మహర్దశ కావున ముత్యమును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం శ్రేయస్కరం.
FILE
ఇదిలా ఉంటే తులారాశి, విశాఖ నక్షత్రం, మూడో పాదంలో పుట్టిన జాతకులకు నీలపు రంగు అన్ని విధాలా కలిసివస్తుంది. కాబట్టి నీలపు రంగు చేతిరుమాలును వాడటం మంచిది. అదృష్ట సంఖ్యల విషయానికొస్తే.. వీరికి 6 అనే సంఖ్య అన్ని విధాలా అనుకూలిస్తుంది. 4, 5, 8 అనే సంఖ్యలు శుభ ఫలితాలిస్తాయి.
కానీ 1, 2 అనే సంఖ్యలు వీరికి కలిసిరావు. ఇంకా ఈ జాతకులపై శుక్రుని ప్రభావముండుట చేత గురువారం వీరికి శుభఫలితాలనిస్తుందని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు.