పుబ్బ నక్షత్రం, రెండో పాదములో జన్మించినవారైతే..!?

FILE
పుబ్బ నక్షత్రం, రెండో పాదములో జన్మించిన జాతకులు వజ్రమును బంగారముతో పొదిగించి ఉంగరపు వేలుకు ధరించడం ద్వారా శుభఫలితాలు చేకూరుతాయి. ఈ జాతకులు పుట్టిన 15 సంవత్సరముల నుంచి 21 సంవత్సరముల వరకు రవి మహర్దశ కావున కెంపును వెండితో పొదిగించి ఉంగరపు వేలుకు ధరించడం శ్రేయస్కరం.

21 సంవత్సరముల వయస్సు నుండి 31 సంవత్సరముల వరకు చంద్ర మహర్దశ కావున ముత్యమును వెండిలో ఉంగరపు వేలుకు ధరించగలరు. 31సంవత్సరముల నుంచి 38 సంవత్సరముల వరకు కుజ మహర్దశ కావున పగడమును బంగారముతో పొదిగించుకుని ఉంగరపు వేలును ధరించడం ద్వారా వ్యాపారాభివృద్ధి, ఉన్నత పదవులను అలంకరించడం వంటి మంచి ఫలితాలుంటాయి.

38 సంవత్సరముల నుండి 56 సంవత్సరముల వరకు రాహు మహర్దశ కావున గోమేధికమును వెండిలో మధ్య వేలుకు ధరించగలరు. 56 సంవత్సరముల వయస్సు నుండి 72 సంవత్సరముల వరకు గురు మహర్దశ కావున కనక పుష్యరాగమును బంగారములో చూపుడు వేలుకు ధరించగలరు.

72 సంవత్సరముల వయస్సు నుండి 91 సంవత్సరమువ వరకు శని మహర్ధశ కావున నీలమును వెండిలో మధ్య వేలుకు ధరించడం శ్రేయస్కరంమని రత్నాల శాస్త్ర నిపుణులు అంచనా వేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి