పుష్యమి నక్షత్రం, రెండో పాదములో పుట్టినవారైతే..!

FILE
పుష్యమి నక్షత్రం, రెండో పాదములో పుట్టిన జాతకులైతే 14 సంవత్సరముల వరకు శని మహర్దశ కావున నీలమును వెండితో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించగలరు. 14-31 సంవత్సరాల కాలంలో ఈ జాతకులకు బుధ మహర్దశ కావున పచ్చను బంగారముతో చిటికెన వేలుకు ధరించడం శ్రేయస్కరమని రత్నాల శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

31-38 సంవత్సరాల వరకు కేతు మహర్దశ కావున వైఢూర్యమును వెండితో పొదిగించుకుని చిటికెన వేలికి ధరించడం ద్వారా శుభ ఫలితాలుంటాయి. ఇంకా 38-58వ సంవత్సరాల వరకు ఈ జాతకులకు శుక్రమహర్దశ కావడంతో వజ్రమును బంగారముతో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం ద్వారా ఆయుర్దాయం, వ్యాపారాభివృద్ధి చేకూరుతాయి.

58 నుంచి 64 సంవత్సరాల వరకు పుష్యమి రెండో పాదములో పుట్టిన జాతకులకు రవి మహర్దశ కావడంతో కెంపును వెండితో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం మంచిది. అలాగే 64-94 సంవత్సరము వరకు ఈ జాతకులకు చంద్ర మహర్దశ కావడంతో ముత్యమును వెండితో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం శుభదాయకం.

ఇకపోతే.. 74 సంవత్సరాల నుంచి 81వరకు పుష్యమి రెండో పాదములో పుట్టిన జాతకులకు కుజ మహర్దశ కావడంతో పగడమును బంగారముతో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం మంచిదని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు.

కాగా పుష్యమి రెండో పాదములో పుట్టిన జాతకులకు బుధ, ఆదివారాలు మంచి ఫలితాలనిస్తాయి. గురువారం మాత్రం వీరికి అనుకూలించదు. అలాగే తెలుపు, క్రీమ్ వంటి రంగులు ఈ జాతకులకు శుభ ఫలితాలనిస్తాయి. ఈ రంగులతో కూడిన దుస్తులను ధరించడం ద్వారా మనశ్శాంతి చేకూరుతుందని రత్నాల శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.

ఇక అదృష్టాన్నిచ్చే సంఖ్యల విషయానికొస్తే, రెండు మరియు ఏడు సంఖ్యలు ఈ జాతకులకు శుభ ఫలితాలిస్తాయి. 2, 11, 20, 29, 38, 47, 16, 25, 34, 43, 52, 61, 70 అనే సంఖ్యలు కూడా వీరికి కలిసివస్తాయి. 3, 6, 8, 9 అనే సంఖ్యలు సామాన్య ఫలితాలిస్తాయి. అయితే నాలుగు అనే సంఖ్య మాత్రం ఈ జాతకులకు అశుభ ఫలితాలిస్తుందని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి