మిథున లగ్నములో జన్మించిన జాతకులు వజ్రమును ధరించడం ద్వారా ప్రతిభ పెరగడంతో పాటు భోగవిలాసములు చేకూరుతాయని రత్నాల శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
జాతిపచ్చను ధరించడం ద్వారా విద్యా మరియు బుద్ధి పెరుగును. వాహన సౌఖ్యము, గృహ సంపదన కలుగును మానసిక శాంతి లభించును. ఈ జాతకులు నీలాన్ని ధరించడం ద్వారా ఆయువు, ఆకస్మిక ధనలాభము ఉంటుందని రత్నాల శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.
అలాగే కర్కాట లగ్నములో జన్మించిన జాతకులు ముత్యమును ధరించడం ద్వారా మానసిక శాంతి కలిగి ఆరోగ్యములో వృద్ధి మరియు ఆయుష్షు పెరుగుతుంది. అలాగే కర్కాటక లగ్నములో పుట్టిన జాతకులు పగడమును ధరించడం ద్వారా ధన, పదవి, మర్యాదలు కలుగుతాయి. ఉద్యోగం లభిస్తుంది. పదోన్నతి పొందెదరు.
ఇంకా కనకపుష్యరామును ధరించడం ద్వారా ధన, గౌరవము, శుభకార్యములు, ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం వంటి శుభఫలితాలుంటాయని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు.