మీనరాశిలో పుట్టిన జాతకులు దయాహృదయులుగా ఉంటారని రత్నాల శాస్త్రం చెబుతోంది.
ధైర్యవంతులు, కష్టజీవులుగా ఉండే ఈ జాతకులు పుష్యరాగం ధరిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు.
టోపాజ్ అని పిలువబడే పుష్యరాగ రత్నాన్ని ధరించే మీనరాశి జాతకులకు గురుగ్రహ దోషాలు తొలగిపోతాయి. బలము, వీర్యము, నేత్రజ్యోతి పెరుగుతుంది. చదువులోనూ, అభ్యాసములోనూ ప్రగతి చెందుతారని రత్నాల శాస్త్రం చెబుతోంది.
పసుపు రంగును కలిగి ఉండే కనకపుష్యరాగంపై ఎటువంటి చారలు వుండవు. పుష్యరాగంలో కనకపుష్యరాగం, శ్వేత పుష్యరాగం అనే రెండు రకాలు కలవు. పుష్యరాగము ఎలా ఉంటుందంటే..? పారదర్శకము మరియు కాంతివంతముగా వుంటుంది. అసలైన కనకపుష్యరాగమును ఎండలో ఉంచితే వెలుగు వ్యాప్తి చెందుతుంది. పుష్యరాగమును చేతిలో తీసుకుంటే బరువుగా ఉంటుంది.
ఎలా ధరించాలంటే..? గురువారం సూర్యోదయానికి ధరించాలి. బంగారపు లోహములో పొదిగించి, కుడిచేతి చూపుడు వ్రేలుకు ధరించాలి. ముందుగా పాలులోగానీ, గంగాజలములో గానీ శుద్ధి చేయాలి. గురు ధ్యాన శ్లోకములు 160 మార్లు ధ్యానించి ధరించడం ద్వారా ఈతిబాధలు తొలగిపోయి, సకల సంపదలు చేకూరుతాయని రత్నాల శాస్త్రం చెబుతోంది.