మీరు మీనరాశి జాతకులా? పుష్యరాగం ధరించండి.

కష్టజీవులు, దయాహృదయులు, ధైర్యవంతులైన మీనరాశి జాతకులు కనకపుష్యరాగం ధరిస్తే మంచిదని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు. ఈ రాశ్యాధిపతి గురువు (బృహస్పతి) కావడంతో, గురు గ్రహ దోషాలను తొలగించేందుకు కనక పుష్యరాగాన్ని ధరించడం శ్రేయస్కరమని వారు చెబుతున్నారు.

బలమును, వీర్యమును, నేత్రజ్యోతిని పెంచేందుకు కనకపుష్యరాగ ధారణ చాలా మంచిదని రత్నాల శాస్త్రం పేర్కొంటుంది. పసుపు రంగులో ఉండే ఈ రత్నమును గురువారం సూర్యోదయానికి ధరించాలి. బంగారంతో పుష్యరాగాన్ని పొదిగించి, కుడిచేతి చూపుడు వ్రేలుకు ధరించాలి.

ముందుగా పాలులో గానీ, గంగాజలములో గానీ పుష్యరాగాన్ని శుద్ధి చేయాలి. ధరించే ముందు గురు ధ్యాన శ్లోకములను 160 మార్లు ధ్యానించాలి. ఇలా చేస్తే వ్యాపారము, వ్యవసాయములో వృద్ధి చెందుతారని రత్నాల శాస్త్రం చెబుతోంది.

కనక పుష్యరాగం ఎలా ఉంటుందంటే..?
ఈ పుష్యరాగంపై ఎలాంటి చారలుండవు. పారదర్శకముగానూ, కాంతివంతముగానూ ఉంటుంది. అసలైన కనకపుష్యరాగమును ఎండలో ఉంచితే వెలుగు వ్యాప్తి చెందుతుంది.

వెబ్దునియా పై చదవండి