రోహిణి నక్షత్రం రెండోపాదంలో జన్మించిన వారికి ఏడున్నర సంవత్సరాల పాటు చంద్రమహర్దశలో సంచరించడంతో ముత్యాన్ని వెండితో పొదిగించి ఉంగరపు వ్రేలుకు ధరించాలని రత్నశాస్త్రకారులు తెలుపుతున్నారు.
ఏడున్నరేళ్ల నుండి 14 సంవత్సరాల ఆరు నెలల వరకు కుజమహర్దశ ప్రభావం ఉండటంతో... పగడాన్ని బంగారంలో పొదిగంచి ఉంగరపు వ్రేలుకు ధరించుకోవాలి.
అలాగే 14 ఏళ్ల ఆరునెలల నుండి 32 సంవత్సరాల ఆరునెలల వరకు రాహుమహర్దశ సంచారం కారణంగా గోమేధికమును వెండిలో పొదిగి మధ్యవ్రేలుకు ధరించవచ్చునని శాస్త్రజ్ఞులు అంటున్నారు.
32 సంవత్సరాల ఆరునెలల నుండి 48 ఏళ్ళ ఆరు నెలల వరకు గురుమహర్దశ జరగడంతో కనక పుష్యరాగమును బంగారంతో పొదిగించి చూపుడు వ్రేలుకు ధరించుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి.
48 సంవత్సరాల ఆరు నెలల నుండి 67 ఏళ్ళ ఆరు నెలల వరకు శనిమహర్దశ ఉండటంతో... నీలమును వెండిలో పొదిగించుకుని మధ్య వ్రేలుకు ధరించుకున్నట్లైతే మంచి ఫలితాలనిస్తాయని రత్నశాస్త్రకారులు తెలుపుతున్నారు.
67 ఏళ్ళ ఆరునెలల నుంచి 84 సంవత్సరాల ఆరు నెలల వరకు బుధమహర్దశ సంచరిస్తుండడంతో... పచ్చను బంగారంలో పొదిగించుకుని చిటికెన వ్రేలుకు ధరించుకున్నట్లైతే సత్ఫలితాలనిస్తాయని రత్నశాస్త్రకారులు తెలుపుతున్నారు.
84 సంవత్సరాల ఆరునెలల నుంచి 91 సంవత్సరాల ఆరు నెలల వరకు కేతుమహర్దశ జరుగుతుండటంతో... వైఢూర్యమును వెండిలో పొదిగించుకుని చిటికెన వ్రేలుకు ధరించుకున్నట్లైతే శుభదాయకమని రత్నశాస్త్రకారులు తెలుపుతున్నారు.