విశాఖ నక్షత్రము, ఒకటో పాదములో జన్మించిన జాతకులు 16 సంవత్సరముల వరకు గురు మహర్దశ కావున కనకపుష్యరాగమును బంగారములో చూపుడు వేలుకు ధరించడం ద్వారా శుభఫలితాలుంటాయి. 16-35 సంవత్సరముల వరకు శని మహర్దశ కావున నీలమును వెండిలే మధ్య వేలుకు ధరించడం మంచిది.
35-52 సంవత్సరాల వరకు బుధ మహర్దశ కావున పచ్చను బంగారములో చిటికెన వేలుకు ధరించగలరు. 52 సంవత్సరముల వయస్సు నుంచి 59 సంవత్సరముల వరకు కేతు మహర్దశ కావున ఈ జాతకులు వైడూర్యమును వెండితో పొదిగించుకుని చిటికెన వేలుకు ధరించగలరు.
59 సంవత్సరముల వయస్సు నుంచి 79 సంవత్సరముల వరకు శుక్ర మహర్దశ కావున వజ్రమును బంగారములో ఉంగరపు వేలుకు ధరించడం ద్వారా శుభఫలితాలుంటాయి. 75 నుంచి 85 సంవత్సరముల వరకు రవి మహర్దశ కావున కెంపును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం శ్రేయస్కరమని రత్నాల శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.