శనిగ్రహదోష నివారణకు నీల రత్నం ధరించితే ఫలితం!

మంగళవారం, 22 ఏప్రియల్ 2014 (15:57 IST)
File
FILE
చాలా మంది ఏలి నాటి శని పట్టిందని అంటుంటారు. ఇలా శని గ్రహ దోష నివారణకు నీలరత్నం ధరించాలని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు. జాతినీలం రత్నాన్ని పాలల్లో వేస్తే పాలవర్ణం కొద్దిగా నీలిరంగుగా మారుతుంది. శనిగ్రహ ప్రభావంచే శత్రువుల వల్ల, స్నేహితుల వల్ల మోసపోకుండా ఉండేందుకు నీలాన్ని ధరించాలి. నీలిరత్నంతో పాటు సప్తముఖి, షోడశముఖ రుద్రాక్షలను ధరిస్తే కూడా శనిగ్రహ దోష నివారణ జరుగుతుందని పురోహితులు చెబుతున్నారు.

శనిగ్రహ ప్రభావంచే దొంగల వల్ల భయాలు, దొంగతనాలు అట్టకట్టడం, వివాహంలో అపశృతులు, ఆటంకాలు, లోపాలు వంటివి కలుగుతాయి. ఈ శనిగ్రహ ప్రభావం నుంచి బయటపడటానికి నీలిరత్నాన్ని ధరించడం శ్రేయస్కరం.

ఇంకా శనిగ్రహ దోషం నుంచి తప్పుకోవాలంటే పెరుగు, పాలతో తిలకం చేసుకుని ధరించండి. నూతిలో పాలు పోయించడం, కాకులకు అన్నం పెట్టడం వంటి చేయాలి. దేవాలయంలో కర్పూరం దానం చేయండని పురోహితులు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి