హస్త నక్షత్రం ఒకటో పాదములో జన్మించిన జాతకులు పుట్టిన పది సంవత్సరముల వరకు చంద్ర మహర్దశ కావడంతో ముత్యమును వెండితో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం శ్రేయస్కరం. అలాగే పది సంవత్సరాల నుంచి 17 సంవత్సరముల వరకు ఈ జాతకులకు కుజ మహర్దశ కావడంతో పగడమును బంగారముతో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం ఉత్తమం.
అలాగే 17-35 సంవత్సరము వరకు హస్త నక్షత్రం ఒకటో పాదములో జన్మించిన జాతకులకు రాహు మహర్దశ కావున కనకపుష్యరాగమును బంగారములో చూపుడు వేలుకు ధరించగలరు. 51-90 సంవత్సరముల వరకు ఈ జాతకులకు శని మహర్దశ కావున నీలమును వెండిలో మధ్యవేలుకు ధరించడం మంచిది.
ఇంకా 70-87 సంవత్సరాల మధ్య కాలం బుధ మహర్దశ కావున పచ్చబంగారములో పొదిగించుకుని చిటికెన వేలికి, 87-99 సంవత్సరముల వరకు కేతు మహర్దశ కావున వైడూర్యమును వెండిలో చిటికెన వేలుకు ధరించడం మంచిదని రత్నాల శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.