చంద్రమండలంలో ధ్వని ఎందుకు విన్పించదు?

మంగళవారం, 1 నవంబరు 2011 (13:45 IST)
FILE
ఏవేని రెండు వస్తువులు ఒకదానికొకటి తాకిడి జరిగినప్పుడు శబ్దం పుడుతుంది. అయితే కంపించే అన్ని వస్తువుల శబ్దాలను మనం వినలేం. మనం వినగలిగే శబ్దాలను శ్రావ్య ధ్వనులంటారు. శబ్దం యాంత్రిక తరంగం అవటం వలన దీని ప్రసారానికి యానకం కావాలి. అనగా ఘన, ద్రవ, వాయు పదార్థాలలో ఏదో ఒకటి ఉన్నప్పుడు మాత్రమే కంపనలో ధ్వని పుడుతుంది.

శూన్యంలో యానకం ఉండదు. కాబట్టి కంపనలు జరగవు. అందువల్ల ధ్వని పుట్టదు. కాబట్టి శూన్యంగా లేదా చంద్రునిపై శబ్దం వేగం సున్నా, అందుకే మనిషి చంద్రమండలం మీద మామూలుగా మాట్లాడటానికి వీలు కాదు. చప్పట్లు కొట్టినా, తుపాకి పేల్చినా వాటి శబ్దాలు మన చెవికి చేరవు. అందుకే చంద్రునిపై ధ్వని వినలేం అంటున్నారు పరిశోధకులు.

వెబ్దునియా పై చదవండి