పక్షి గుడ్డు నుంచి బయటికి రావడానికి ఎంత సమయం పడుతుంది..

FILE
పక్షి పిల్లలు గుడ్డు లోపల నుంచి పెంకును ముక్కుతో పొడుచుకొని బయటికి వస్తాయి. అవి గుడ్డు పెంకు పగలగొట్టుకొని బయటికి రావడానికి ఉపయోగపడే 'ఎగ్‌టూత్'ని కలిగి ఉంటాయి. ఇది పక్షిపిల్లల ముక్కు చివరన ఉంటుంది. దీని సహాయంతోనే పక్షి పిల్లలు పెంకును మెల్లిమెల్లిగా పొడుస్తూ, చివరికి దాన్ని పగలకొట్టుకొని బయటికి వస్తాయి.

అలా బయటికి రావడానికి చాలా రకాల పక్షుల్లో ముప్పై నిమిషాల నుంచి ఒక గంట వరకూ పడుతుంది. ఎగిరే పక్షుల్లో పెద్దవైన ఆల్‌బట్రాస్ అనే సముద్రపు పక్షుల పిల్లలకు మాత్రం అలా పెంకును పగులకొట్టుకుని బయటికి రావడానికి కనీసం ఆరు రోజులు పడుతుంది. ఆల్‌బట్రాస్ పక్షి గుడ్డు పెంకు చాలా గట్టిగా ఉండడమే ఇందుకు కారణం.

వెబ్దునియా పై చదవండి