ప్రపంచంలో అన్నిటికన్నా పెద్ద జంతువు ఏది?

శనివారం, 28 జనవరి 2012 (16:51 IST)
నీలి తిమింగలం ప్రపంచంలో అన్నిటికన్నా పెద్ద జంతువు. ఇవి మాంసాహార జీవులు. ఈ నీలి తిమింగలాల మెదడు 20 పౌండ్లు, గుండె 500 పౌండ్లు, నాలుక సుమారు 6000 పౌండ్ల బరువు ఉంటాయి. ఇలా మొత్తం బ్లూవేల్ బరువు 200 టన్నుల వరకు ఉంటుంది.

నీలి తిమింగలం జీవితకాలం 80 నుంచి 90 సంవత్సరాలు ఉంటుంది. వీటిలో సుమారు 105 మీటర్ల పొడవుండే నీలి తిమింగలాలు కూడా ఉంటాయి. వీటిలో ఆడ తిమింగలాలు రోజుకు 90 గ్యాలన్ల పాలు స్రవిస్తాయి. తిమింగలం పిల్ల రోజుకు 150 పౌండ్లు పెరుగుతుంది. నీలి తిమింగలం శ్వాస క్రియలో బ్లో హోల్ అనే నాసికా రంధ్రం గుండా ఊపిరి వదిలితే 30 అడుగుల దూరం వరకు వెళుతుంది.

వెబ్దునియా పై చదవండి