పెద్దపెద్ద నక్షత్రాలు కాంతిహీనం అయినప్పుడు అంతరిక్షంలో ఏర్పడే చీకటి క్షేత్రాలనే అంతరిక్షశాస్త్ర పరిభాషలో 'బ్లాక్ హోల్స్' అంటారు. 1907లో జర్మన్‌కు చెందిన ఖగోళ శాస్త్రజ్ఞడు కార్ల్ స్వార్జ్‌ఛేల్డ్ బ్లాక్ హోల్స్‌ను కనుగొన్నాడు.
బ్లాక్ హోల్‌లో గురుత్వాకర్షణశక్తి చాలా ఎక్కువ. ఏదైనా వస్తువు దీనిలోకి వెళితే తిరిగిరాదు. కాంతి కూడా ఆకర్షణశక్తి నుండి తప్పించుకుని పోలేదు. కాంతిని బ్లాక్‌హోల్‌లోకి ప్రసరింపజేసినా అది పరావర్తనం చెందదు.
సూర్యుడి కంటే ఎక్కువ ద్రవ్యరాశి గల నక్షత్రాలు మృతప్రాయాలైనప్పుడు బ్లాక్ హోల్స్ ఏర్పడతాయని కార్ల్ సిద్ధాంతంపరంగా నిరూపించాడు. ఏదానా కారణం వల్ల నక్షత్రం లోపలవున్న పదార్థం తరిగిపోతూ వుంటే. నక్షత్రం ఉష్ణోగ్రకత కూడా తగ్గిపోయి నక్షత్రంలోని అణువులు ప్రోటానులు, న్యూట్రానులు, ఎలక్ట్రానులుగా విడిపోతాయి.
న్యూట్రాన్ నుండి వెలువడే కాంతి తగ్గిపోవడంతో క్రమంగా కాంతి పూర్తిగా వెలువడని పరిస్థితి ఏర్పడుతుంది. దీన్నే బ్లాక్‌హోల్ అంటారు.