హిందూమహాసముద్రం రాత్రుళ్లు ఎందుకు మెరుస్తుంది....!?
శనివారం, 1 అక్టోబరు 2011 (16:32 IST)
FILE
సముద్రం రాత్రుళ్లు మెరవడం గురించి ఎప్పుడైనా విన్నారా! హిందూమహాసముద్రపు ఉపరితలం ఒక్కొక్కసారి రాత్రిపూట మెరుస్తూ ఉంటుంది. ఆ కాంతి ఎలా వస్తుందో చాద్ధాం.
హిందుమహాసముద్రంలో ఉండే కొన్ని చిన్నచిన్న సముద్రపు మొక్కల నుంచి కాంతి వస్తుంది. డైనో ఫ్లాజెల్లేట్స్ అనే ఈ మొక్కలు వాటిలోని కొన్ని కదలికల కారణంగా కాంతినిస్తాయి. ఇవి అత్యధిక సంఖ్యలో ఉన్నప్పుడు మనం చూడగలిగేంత కాంతినిస్తాయి.
ఇవి చూడడానికి చిన్నచిన్న దీపాల్లా కనిపిస్తూ ఒక్కోసారి చక్రం ఆకారాన్ని కూడా ఏర్పరుస్తాయి. ఈ చక్రం వెడల్పు 1.5 కిలోమీటర్ల వరకు కూడా ఉంటుంది.