హిమాలయాలకు వయస్సు ఎంత?

శుక్రవారం, 18 నవంబరు 2011 (14:17 IST)
FILE
చూడగానే మనస్సుకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగించే హిమాలయ పర్వతాలు, ప్రపంచంలోనే ఎత్తయిన పర్వతాలుగా పేరుపొందాయి. ఈ హిమాలయపర్వతాల వయస్సును శాస్త్రవేత్తలు ప్రస్తుతం అంచనా వేస్తున్న దానికంటే ఇంకా 50 లక్షల సంవత్సరాలు ఎక్కువగానే ఉండవచ్చునని తాజాగా భారత్, బ్రిటన్‌లకు చెందిన శాస్త్రవేత్తల చెప్తున్నారు.

అయితే ఇప్పటివరకు హిమాలయాలు 80 లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడి ఉంటాయని పరిశోధకులు అంచనావేస్తూ వచ్చారు. మన దేశానికి చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీకి చెందిన కె.ఎన్.కృష్ణ, బ్రిటన్‌కు చెందిన జాన్ బుల్, రోజర్ స్కట్టన్‌లు హిమాలయాల వయస్సుకు సంబంధించి పరిశోధనలు జరిపారు. వీరి ఉమ్మడి పరిశోధనలో 1.33 నుంచి 1.44 కోట్ల సంవత్సరాల మధ్య హిమాలయ పర్వతాలు ఏర్పడి ఉంటాయని పలికారు.

వెబ్దునియా పై చదవండి