మీ కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే.. ఈ ఎక్సర్‌సైజ్‌లు తప్పనిసరి!

శుక్రవారం, 29 మార్చి 2013 (13:12 IST)
FILE
యోగా, స్విమ్మింగ్, జాగింగ్ వంటివి ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో..అదే విధంగా మన కళ్లకు కూడా కొన్ని ఎక్సర్‌సైజ్‌లు చాలా అవసరం. కంప్యూటర్ల ముందు కూర్చోవడంతో పాటు నిద్రలేమితో అలసిపోయే కళ్లకు తప్పకుండా మసాజ్ వంటి ఎక్సర్‌సైజ్‌లు అవసరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే.. ఈ టిప్స్ పాటించాల్సిందే.

1. ఒక కూర్చీపై కూర్చుని చేతిని బాగా రుద్ది ఆ చేతులతో మీ కంటిని మూసేయండి. ఇలా చేసేటప్పుడు కంటిపై మీ చేతుల ఒత్తిడి అధికంగా ఉండకూడదు. ముక్కును సైతం మూతపెట్టేలా మీ చేతిని కంటితో కప్పుకోవాలి. ఇలా చేతులతో మీ కంటిని మూత పెట్టుకున్నాక.. చీకటిని ఆస్వాదించి.. కొన్ని మీకు జరిగిన ఆహ్లాదకరమైన విషయాలను తలచుకోండి. శ్వాసను మెల్లగా పీల్చి విడిచిపెట్టండి. ఇలా మూడు నిమిషాలకు ఒకసారి చేయాలి.
FILE


2. కంటిని 3-5 సెకన్ల గట్టిగా మూసి, తర్వాత 3-5 సెకన్ల తెరిచి వుంచాలి. ఇలా ఏడు లేదా 8 సార్లు చేయాలి.
FILE

3. ఐ-మసాజ్.. ఆస్ వాటర్ లేదా హాట్ వాటర్ మసాజ్ : ఐస్ వాటర్ లేదా వేడి నీటితో ఓ కాటన్ వస్త్రాన్ని ముంచి ఆ వస్త్రాన్ని రెండు కంటిపై కాసేపు ఉంచండి.

4. వేడి నీటితో కాటన్ వస్త్రాన్ని తడిపి కళ్లు మినహా గొంతు, నుదురు, బుగ్గలకు మసాజ్ చేసుకున్నాక తర్వాత మెల్లగా కంటిపై ఉంచాలి.

5. కంటి రెప్పలపై 1-2 నిమిషాల పాటు చేతివేళ్లతో మసాజ్ చేయాలి. ఇలా చేసేటప్పుడు మీ చేతులు శుభ్రంగా ఉండాలి.
FILE


6. 1-2 సెకన్లు మీ కంటి రెప్పల్ని రెండు చేతులతో మూతపెట్టాలి. ఇలా ఐదుసార్లు చేయాలి.
7. ప్రశాంతంగా ఓ కుర్చీపై కూర్చుకని కంటిని ఎడమ వైపు.. తర్వాత కుడివైపు తిప్పుతుండాలి. ఐలా ఐదుసార్లు చేయాలి. మధ్య మధ్య కంటి రెప్పల్ని ఆర్పుతూ ఉండాలి.

8. 10-15 సెకన్ల పాట 150 అడుగులు లేదా 50 మీటర్ల వరకు కంటిచూపుతో చూడండి. తర్వాత మెల్లగా మీకు సమీపంలో ఉన్న వస్తువును (30 అడుగులు లేదా పది మీటర్ల దూరం) చూడండి.
FILE
10-15 సెకన్ల పాటు ఇలా చేసి.. తిరిగి 50 మీటర్ల వరకు చూడండి. ఇలా ఐదుసార్లు చేయండి.


9. అలాగే తలను తిప్పకుండా మీ కంటిని పైకి కిందకి ఎనిమిది సార్లు చూసేలా చేయండి. తర్వాత కుడి, ఎడమవైపు మీ కంటిని తిప్పండి. ఇలా ఎనిమిది సార్లు చేయండి. ఈ టిప్స్ పాటిస్తే మీ కళ్లు ఆరోగ్యంగా ఉంటాయని ఐ-స్పెషలిస్టులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి