మద్యం సేవించి.. ఇలా చేస్తే..?

శుక్రవారం, 8 మార్చి 2019 (15:51 IST)
చాలామంది యువకులు, పురుషులు.. మద్యం సేవించిన తర్వాత వాసన రాకుండా ఉండేందుకు ఇంటికెళ్లిన వెంటనే బాత్రూంలో దూరి బ్రష్ చేస్తుంటారు. మరికొందరైతే లవంగాలు, పాన్ మసాలా, వక్కపొడి, యాలకులు ఇలా తమకు తోచినవి నోట్లో వేసుకుంటారు. వీటిలో బ్రష్ చేయడం హానికరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
మద్యంలో ఆమ్లం ఎక్కువగా ఉంటుంది. మద్యం సేవించిన వెంటనే ఇంటికెళ్లి బ్రష్ చేయడం వల్ల దంతాలపై ఉండే ఎనామిల్ పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఇది జరిగితే దంతాలు త్వరగా పుచ్చిపోతాయి. అందువలన మద్యం సేవించిన వెంటనే బ్రష్ చేయరాదని నిపుణులు సలహా ఇస్తున్నారు. 
 
మద్యం సేవించడం ఆరోగ్యానికి మంచిదికాందుటున్నారు వైద్యులు. ఒకవేళ సేవిస్తే.. అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. లేదంటే పలురకాల సమస్యలతో పాటు రకరకాల వ్యాధులకు గురికావలసి వస్తుంది. ముఖ్యంగా కడుపు ఉబ్బరం, వాంతి, గురక వంటివి ఎదుర్కుంటారు. కనుకు వీలైనంత వరకు మద్యం సేవించడం మానేస్తే మంచిది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు