ఇవి తింటే మానసిక ఒత్తిడి కొనుక్కున్నట్లే... ఏంటవి?

శుక్రవారం, 14 సెప్టెంబరు 2018 (10:45 IST)
ఈ ఆధునిక జీవితంలో ఒత్తిడి అనేది సహజమైపోయింది. దీనికితోడు తీసుకునే ఆహారాన్ని బట్టి కూడా మనిషి మూడ్ మారిపోతుంటుంది. అతిగా కొవ్వు పదార్థాలు తీసుకునేవారిలో, వేపుళ్ళు ఎక్కువుగా తినేవారిలో మానసిక ఒత్తిడి అవకాశం ఎక్కువ వుంటుందని వైద్య నిపుణులు చెపుతున్నారు. ఇక జంక్ పుడ్ తినేవారి విషయం వేరే చెప్పక్కర్లేదు. వాళ్లు డిప్రెషన్ అంచులో ఉన్నట్టు లెక్క. 
 
కనుక మానసిక ఒత్తిడిని ఎదుర్కొనేందుకు కాయగూరలు, పండ్లు, చేపలు ఆహారంగా తీసుకోవాలి. దంపుడు ధాన్యం, పప్పులు తినటం వల్లనే మన దేశంలో మానసిక ఒత్తిడికి గురయ్యేవారి సంఖ్య కాస్త తక్కువగా వున్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. కనుక కొవ్వు పదార్థాలను తక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అన్నివిధాలా మేలు కలుగుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు