అందాన్ని పెంచే పండ్లు ఇవే...

శనివారం, 25 ఆగస్టు 2018 (21:07 IST)
సామాన్యంగా స్త్రీలు అందం అంటే ఎక్కువుగా ఆసక్తి చూపుతారు. దానికోసం రకరకాల ఫేస్ ప్యాక్‌లను, క్రీంలను వాడుతుంటారు. కేవలం వీటినే కాకుండా మనం తినే ఆహారంలో మార్పులు చేసుకోవడం వలన కూడా మంచి ఫలితాన్ని పొందవచ్చు. కొంతమందికి కాలుష్యం, ఎండ బారిన పడటం వలన చర్మం కమిలిపోవడం, తెల్లని మచ్చలు రావడం, గరుకుగా తయారవడం జరుగుతుంది. ఇలాంటి దుష్ప్రభావాల నుండి మీ చర్మాన్ని రక్షించుకోవాలంటే ఈ క్రింది జాగ్రత్తలు పాటించాలి. అవి ఏమిటో చూద్దాం.
 
1. బొప్పాయి, అరటి, జామ, ఆపిల్ వంటి పండ్లను ఎక్కువుగా తీసుకోవాలి.
2. ఎక్కువసార్లు మంచినీరు త్రాగడం అలవాటు చేసుకోవాలి.
3. నిమ్మ, ఉసిరి లాంటి పుల్లటి పండ్లను ఎక్కువుగా తీసుకోవాలి. ఎందుకంటే వీటిలో ఉండే సి విటమిన్ మీ చర్మాన్ని కాపాడుతుంది.
4. రోజూ ఒక గుడ్డును తీసుకుంటే చర్మానికి మంచిది.
5. ఎక్కువుగా పండ్ల రసాలను తాగితే చర్మం కాంతివంతంగా మారుతుంది.
6. నానబెట్టిన బాదం పప్పును ఉదయాన్నే తీసుకుంటే చర్మం పొడిబారదు.
7. తేనెను అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల చర్మం తాజాగా ఉంటుంది.
8. కొబ్బరి నూనెను చర్మమంతా వారానికి ఒకసారి మర్ధన చేసుకోవాలి.
9. కలబందను కొన్ని రోజులపాటు చర్మానికి రాసుకుంటే ఫలితం కనపడుతుంది.
10. టీ స్పూన్ కీరా జ్యూస్‌లో కొంచెం నిమ్మరసం, చిటికెడు పసుపు కలిపి చర్మానికి రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు