జంక్ ఫుడ్స్‌కి శృంగార సామర్థ్యాన్ని మధ్య లింకుందని.. పరిశోధకులు చెప్తున్నారు. తాజా పరిశోధనలో జంక్ ఫుడ్స్ తీసుకునే పురుషుల్లో శృంగార సామర్థ్యం తగ్గిపోయిందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. పని ఒత్తిడి, మారిన ఆహారపు అలవాట్లు, అలసట కారణంగా శృంగారంపై శ్రద్ధ చూపని వారి సంఖ్య పెరిగిపోతుందని పరిశోధకులు తేల్చారు.
జంక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల సంభోగం సమయంలో నీరసం తప్పదని, మద్యపాన సేవనానికి తర్వాత శృంగారం.. పురుషుల్లో వీర్ణకణాలను నాశనం చేస్తుందని వైద్యులు చెప్తున్నారు. అందుకే వ్యాయామం, పోషకాహారం తీసుకోవడం ద్వారా శృంగార సామర్థ్యాన్ని పెంపొందింపజేసుకోవచ్చునని వారు సూచిస్తున్నారు.