కొవ్వు పదార్థాలను అధిక రక్తపోటు వున్నవారు దూరంగా పెట్టేయాలి. సాచ్యురేటెడ్ ఫ్యాట్, ట్రాన్స్-ఫ్యాట్లను ఖచ్చితంగా దూరంగా పెట్టేయాలి. ఇవి రెండూ గుండెకు, రక్త నాళాలను పాడు చేయడంలో ముందుంటాయి. ఎందుకంటే ఆల్రెడీ అధిక రక్తపోటు కారణంగా రక్త నాళాలు, గుండె ఎంతో ఒత్తిడికి గురై ఉంటాయి. ఈ స్థితిలో వాటిపై కొవ్వులు కూడా దాడి చేస్తే ఇక అన్నీ కలిసి ప్రాణం తీసేందుకు సిద్ధమైపోతాయి. ఫాస్ట్ ఫుడ్స్, ఎర్ర మాంసం, వేరుశనగ పప్పు నూనె, నేయి... తదితర కొవ్వు శాతం ఎక్కువగా ఉన్న పదార్థాలను తగ్గించాలి. అప్పుడే రక్తపోటును నియంత్రించవచ్చు.