అలాగే ప్రతిరోజు భోజనానంతరం గులాబీ రేకుల్ని నమిలితే జీర్ణప్రక్రియ సులభంగా అవుతుంది. గులాబీలతో తయారుచేసే గుల్కండ్ జలుబుని తక్షణం నివారిస్తుంది. కోల్డ్ టానిక్ మాదిరిగా కూడా ఉపయోగపడుతుంది. గర్భిణులు దీనిని రెండు వెూతాదులుగా తీసుకుంటే వారిలోని ఉష్ణం తగ్గుముఖం పడుతుంది. రోజూ రెండు గ్రాముల గులాబీ రసం తీసుకుంటే పిత్తాశయ వికారాలు తగ్గి ఆరోగ్యం యథాస్థాయికి చేరుతుంది.
గులాబీ రేకులు, బాదంపపప్పు పాలు కలిపి రోజూ ఉదయాన్నే తీసుకుంటే రక్తపోటు తగ్గిపోతుంది. శరీర దుర్గంధంతో బాధపడేవారు గులాబీ రేకుల రసాన్ని కొన్ని రోజులపాటు శరీరానికి మర్ధనా చేస్తే చమటని తగ్గించి దుర్గంధాన్ని నివారిస్తుంది.