సాధారణంగా మజ్జిగ తాగడం ద్వారా కొలెస్ట్రాల్ తగ్గుతుందట. అతిగా తిని మజ్జిగ తాగితే తీసుకున్న ఆహారం తేలిగ్గా జీర్ణమవుతుంది. మజ్జిగ కొలెస్ట్రాల్‌ని సులభంగా కరిగిస్తుంది. ఇంకా కడుపు నిండిన భావన కలగడంతో ఆహారాన్ని ఎక్కువగా తీసుకోలేం. తద్వారా మెటబాలిజం మెరుగై శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయులు తగ్గుతాయి. కమ్మని పెరుగును పలచని మజ్జిగగా తాగడం ద్వారా వేసవి నుంచి ఉపశమనం లభిస్తుంది.