వేసవి కాలం వచ్చేసింది. మన దాహాన్ని తీర్చకోవడానికి ఫ్రిజ్‌లో కూల్ డ్రింక్స్, మంచినీరు ఎక్కువగా వాడుతుంటాము. చల్లనివి తాగేటప్పుడు బాగానే ఉంటాయి కానీ మన ఆరోగ్యానికి చాలా నష్టం చేకూరుస్తాయి. వేసవిలో విరివిగా దొరికే చెరుకురసంతో దాహం తీరడమే కాదు శరీరానికి అవసరమైన పోషకాలు కూడా అందుతాయి. శక్తినిచ్చే ఈ వేసవి పానీయానికి మేలు చేసే గుణాలు ఎన్నో ఉన్నాయి. అవేంటో చూద్దాం.
1. చెరుకు రసం స్పోర్ట్స్ డ్రింక్‌గా కూడా ఉపయోగపడుతుంది. ఆటల వల్ల వచ్చే అలసటను దూరం చేసే మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్ కాల్షియం చెరుకు రసంలో ఉంటాయి.
4. క్యాన్సర్ రాకుండా నియంత్రించే ప్లేవనాయిడ్స్ చెరుకు రసంలో ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలు విస్తరించకుండా చేయడంతో పాటు వాటితో పోరాడి నాశనం చేస్తాయి. చెరుకు రసంలోని ఫ్లేవనాల్ ఒంట్లోని ఫ్రీ ర్యాడికల్స్‌ని పారదోలి కాలేయ వ్యాధులు, కామెర్ల నుంచి కాలేయానికి రక్షణ కల్పిస్తాయి.