జబ్బు, దగ్గును తగ్గించే సపోటా.. కిడ్నీలో రాళ్ళను కూడా తొలగిస్తుందట..

మంగళవారం, 27 డిశెంబరు 2016 (12:08 IST)
సపోటా పండులో ఎన్నో పోషకాలున్నాయి. సపోటాలో గుజ్జుకు జీర్ణం చేసే గుణం ఉంటుంది. సపోటాలో శక్తిని ఇచ్చే గ్లూకోజ్‌ లభిస్తుంది. సపోటా కంటికి చాలా మంచిది. దీనిలో విటమిన్‌ ఎ అధికంగా ఉండి, వృద్ధాప్యంలో కూడా కంటి చూపు బాగుండడానికి సహాయపడుతుంది. కాల్షియం, ఫాస్పరస్‌, ఐరన్‌ సమృద్ధిగా ఉండటం వల్ల సపోటా పండు ఎముకల గట్టితనానికి, పెరుగుదలకు బాగా సహాయపడుతుంది. 
 
పిండిపదార్థాలు, అవసరమైన ఇతర పోషకాలు సపోటాలో అధిక మోతాదులో ఉండటం వల్ల గర్భిణీలకు, పాలు ఇచ్చే తల్లులకు చాలా ఉపయోగకరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సపోటా పండు శక్తివంతమైన ఉపశమనకారి కావడం వల్ల నరాల ఒత్తిడిని తగ్గిస్తుంది. 
 
నిద్రలేమితో, అందోళనతో బాధపడుతున్న వ్యక్తులకు సపోటా చాలా మంచిది. ఇది జలుబు, దగ్గు తగ్గడానికి దోహదం చేస్తుంది. మూత్ర పిండాల్లో రాళ్లు తొలగిపోవడానికి సపోటా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. స్థూలకాయ సమస్యకు సపోటా విరుగుడుగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి