గ్రీన్ యాపిల్స్ ఆరోగ్యానికి ఏవిధంగా సాయపడతాయి?

శుక్రవారం, 14 ఆగస్టు 2020 (22:52 IST)
యాపిల్స్ రకరకాలుగా వుంటాయి. యాపిల్ అనగానే మనకు ఎరుపు రంగులో వుండే యాపిల్స్ గుర్తుకువస్తాయి. కానీ గ్రీన్ యాపిల్స్ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గ్రీన్ యాపిల్స్ మధుమేహంను నిరోధిస్తుంది. విటమిన్ ఎ, బి, సి వీటిలో వుండటం వల్ల చర్మానికి ఎంతో మేలు చేస్తాయి.
 
మహిళల్లో ఒత్తిడి శాతం పెరిగినప్పుడు అది క్రమంగా మైగ్రేన్‌ తలనొప్పిగా మారుతుంది. అటువంటి మైగ్రేన్‌ తలనొప్పికి విరుగుడుగా ఆకుపచ్చని యాపిల్స్‌ చక్కగా పనిచేస్తాయి. అంతేకాకుండా గ్రీన్ యాపిల్ పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల జీర్ణవ్యవస్థను శుభ్రపర్చడానికి సహాయపడుతుంది. తద్వారా జీవక్రియను పెంచుతుంది.
 
గ్రీన్ యాపిల్స్‌లో ఇనుము, జింక్, రాగి, మాంగనీస్, పొటాషియం వంటి తదితర ఖనిజాలు వుంటాయి. ఇందులో వుండే ఇనుము రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు పెంచడంలో సహాయపడుతుంది. అంతేకాక జీవక్రియ రేటు పెంచుతుంది. బరువు తగ్గాలనునుకునేవారికి గ్రీన్ యాపిల్ మంచి ఆహారం.
 
ఇందులో వుండే యాంటీ ఆక్సిడంట్లు కణాల పునర్నిర్మాణం, కణాల పునరుత్తేజానికి సాయపడతాయి. ప్రకాశించే చర్మ నిర్వహణలో కూడా సహాయపడతాయి. ఇవి కాలేయం రక్షించడంలో మేలు చేస్తాయి. కాబట్టి మీ డైట్లో గ్రీన్ యాపిల్‌కి కూడా చోటివ్వండి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు