మునుపెన్నడూ లేని విధంగా స్క్రీన్‌లపై కింగ్‌డమ్ విడుదల కాబోతోంది

దేవీ

గురువారం, 24 జులై 2025 (16:36 IST)
Kingdom - vijaydevara
ఇంకా 7 రోజులు మిగిలి ఉన్నాయి. మునుపెన్నడూ లేని విధంగా స్క్రీన్‌లపై కింగ్‌డమ్ విడుదల కాబోతోందంటూ చిత్ర నిర్మాత వెల్లడిస్తున్నారు.  విజయ్ దేవరకొండ తాజా సినిమా కింగ్ డమ్ కోసం సరికొత్తగా చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. జులై 26న తిరుపతిలో కింగ్‌డమ్ ట్రైలర్ విడుదలకాబోతుంది. జూలై 31న సినిమా విడుదలకాబోతోంది. ఈసందర్భంగా ప్రీమియర్స్ కూడా వేయనున్నట్లు తెలుస్తోంది. 
 
అందుకు పవన్ కళ్యాణ్ చిత్రం హరిహర వీరమల్లు తరహాలో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ చిత్రం సాలిడ్ ప్రీమియర్స్ కూడా వేసుకొని ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చింది. అయితే మేకర్స్ ఈ సినిమాపై గట్టి నమ్మకంతో భారీ ఎత్తున ముందు రోజే ఇండియా వైడ్ ప్రీమియర్స్ వేశారు. ఇందుకు మంచి స్పందన వచ్చింది. అందుకే కింగ్ డమ్ కూడా ఆ రేంజ్ లో వుండాలని నిర్మాత నాగవంశీ ప్లాన్ చేస్తున్నారు. దీనికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. యాక్షన్ ఎపిసోడ్స్ బాగా కీలకమని నిర్మాత చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు