రోజు ఉదయాన, ఒక పిడికెడు తెల్లటి నువ్వు విత్తనాలను తినండి. పిడికెడు నువ్వు విత్తనాలలో సూమారు 1,200 గ్రాముల కాల్షియం, మెగ్నీషియం అందడం ద్వారా జుట్టు పెరుగుతుంది. అలాగే కొబ్బరి నీళ్లు తాగడం ద్వారా జుట్టు పెరుగుదలకు కావలసిన క్యాల్షియం అందుతుంది.
రోజు అర కప్పు కొబ్బరి నీరు తాగొచ్చు. లేదా కొబ్బరి పాలు తాగడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. అయితే కొబ్బరి పాలు ఎక్కువ తీసుకోకూడదు. కారణం-కొబ్బరిలో ఎక్కువ సాచురేటేడ్ ఫాట్లు ఉంటాయి, ఇవి శరీర రక్తంలో కొవ్వు పదార్థాల స్థాయిలను పెంచుతాయి.
ఇక మీ జుట్టును దువ్వెటపుడు, వెంట్రుకలకు వ్యతిరేకంగా దువ్వడం మంచిది కాదు. దువ్వెనతో గట్టిగా దువ్వడం వెంట్రుకల ఆరోగ్యానికి మంచిది కాదు. యోగా చేయటం వలన మెడ, తలకు సంబంధించిన భాగాలలో కలిగే ఒత్తిడి శక్తివంతంగా తగ్గించబడుతుంది, అంతేకాకుండా రక్త ప్రసరణ కూడా మెరుగుపరుస్తుంది. యోగాల వలన కేశాల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.