యాపిల్ పండ్లు ఇంచుమించుగా అన్ని సీజన్స్‌లోనూ దొరుకుతాయి. యాపిల్ పండులో విటమిన్స్ అధికంగా ఉంటాయి. ఒక యాపిల్‌లో ఒక మిల్లీగ్రామ్ ఇనుము, పధ్నాలుగు మిల్లీగ్రాముల పాస్పరస్, పది మిల్లీగ్రాముల క్యాల్షియం, ఉంటాయి. యాపిల్ రక్తక్షీణతను నివారిస్తుంది. రక్తక్షీణతగలవారు కనీసం రోజుకు మూడు యాపిల్స్ తీసుకుంటే మంచిది.
చంటిపిల్లలకు విరేచనాలవుతున్నప్పుడు యాపిల్ జ్యూస్ తాగిస్తే విరేచనాలు అరకడుతాయి. యాపిల్ జ్యూస్‌లో యాలకులు, తేనె కూడా కలుపుకుని తీసుకుంటే కడుపులో మంట, పేగుల్లో పూత, అజీర్తి, గ్యాస్‌ట్రబుల్, గుండెలో మంటను నివారిస్తాయి. యాపిల్‌లో పొటాషియం ఎక్కువగా ఉండడం వలన బీపీతోపాటు అన్ని హృదయ వ్యాధులను, మూత్రపిండాల వ్యాధులను అరికడుతుంది.
యాపిల్‌ను ముక్కలుగా కోసి ఉడికించి రోజూ తీసుకుంటే శరీరంలో బొల్లిమచ్చలు నివారణవుతాయి. యాపిల్ చెట్టు వేళ్ళ రసాన్ని త్రాగితే కడుపులో ఏలికపాములు నశిస్తాయి. కామెర్ల వ్యాధిలో వీలైనంత యాపిల్ రసాన్ని తాగుతుంటే లివర్‌ను సంరక్షిస్తుంది. నాడీ సంబంధ వ్యాధులు, మెదడు వ్యాధులు కలవారికి యాపిల్ చాలా మేలు చేస్తుంది.