కుంకుమ పువ్వు ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో తెలుసా?

సిహెచ్

శుక్రవారం, 16 ఆగస్టు 2024 (18:44 IST)
కుంకుమ పువ్వులో ఎన్నో వైవిధ్యభరితమైన ఔషధ విలువలు ఉన్నాయి. అందుకే ఈ పువ్వును ఔషధాలతో పాటు సౌందర్య సాధనాల్లో కూడా ఉపయోగిస్తుంటారు. కుంకుమ పువ్వు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
కుంకుమ పువ్వు వ్యాధినిరోధక శక్తిని పెరచుతుంది.
కుంకుమ పువ్వును పరిమళ ద్రవ్యంగా, మెడిసిన్‌గా, స్నానానికి ఉపయోగిస్తారు.
గర్భిణులు కుంకుమ పువ్వు పొడిని వేడి పాలల్లో వేసుకుని తాగితే పిల్లలు తెల్లగా పుడతారనే విశ్వాసం వుంది.
అజీర్ణం, అధిక రక్తపోటు, ఋతు సమస్యలున్నవారు తీసుకుంటే మంచి ఫలితం.
కుంకుమ పువ్వు ‘క్రోసిన్’, ‘క్రోసెటిన్’లను కలిగి ఉండటం వల్ల జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
కుంకుమ పువ్వు క్యాన్సర్‌ను కలుగ చేసే కారకాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది.
కుంకుమ పువ్వును ఆస్తమా చికిత్సగా కూడా ఉపయోగిస్తారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు