చిన్నవుల్లిపాయ చేసే మేలు ఏంటో తెలుసా?

శుక్రవారం, 3 డిశెంబరు 2021 (23:46 IST)
వెల్లుల్లి జ్వరం, దగ్గు, తలనొప్పి, కడుపు నొప్పి, సైనస్ సమస్యలు, కీళ్ళనొప్పి, ఉబ్బసం, శ్వాస సమస్య, రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలు, రక్తంలో అధిక చక్కెర స్థాయిలు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. వెల్లుల్లి, ఒత్తిడి, అలసటలను తగ్గించటమేకాకుండా, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
 
గర్భిణుల ఆరోగ్యాన్ని నిలకడగా ఉంచుతుంది. బాలింతలకు పాలు బాగా పడేలా చేస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అంతేకాకుండా, వెల్లుల్లి నుంచి విడుదలయ్యే అల్లిసిన్, వివిధ వ్యాధులను తగ్గించే శక్తిని కలిగి ఉంటుంది. శరీరంలోని కొవ్వును కరిగించే శక్తి వెల్లులికి ఉందని వైద్య నిపుణులు అంటున్నారు.
 
వీలైనంతవరకు ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. అదేవిధంగా జుట్టురాలే సమస్య ఉంటే వెల్లుల్లిని గ్రైండ్ చేసుకుని తలకు పట్టిస్తే జుట్టు రాలే సమస్య నుండి విముక్తి కలుగుతుంది. రక్తంలో చక్కెర శాతాన్ని వెల్లుల్లి క్రమబద్ధీకరిస్తుంది. ఖాళీ కడుపుతో వెల్లుల్లి తీసుకోవటం వల్ల జీర్ణాశయ సమర్థతను పెంచుతుంది. 
 
చర్మంపై ఉండే పుండ్లపై రుద్దితే ఉపశమనం కలుగుతుంది. ఇది ఒక శక్తివంతమైన యాంటీ-బయాటిక్‌గా పేర్కొనవచ్చు. వివిధ రకాల అనారోగ్య పరిస్థితులకు చికిత్సగా వాడతారు. వెల్లుల్లిను వాడటం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి, గుండె వ్యాధులను తగ్గించి, కాలేయ, మూత్రాశయ పనితీరును మెరుగుపరుస్తుంది. విరేచనాలు ఇతర జీర్ణాశయ సమస్యలను నుండి త్వరగా ఉపశమనం కలిగిస్తుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు