మాటిమాటికి చేతులు, కాళ్లు తిమ్మిరి పడుతున్నాయా?... తస్మాత్ జాగ్రత్త

సోమవారం, 19 జులై 2021 (08:42 IST)
చాలామందికి ఈ సమస్య ఉంటుంది. కొద్ది సేపు ఎటు కదలకుండా కూర్చొంటే చాలు..చేతులు, కాళ్లకు తిమ్మిర్లు వస్తాయి. కాసేపు చేతులు, కాళ్లు పనిచేయవు. కానీ ఇదీ కామనే అన్న నిర్లక్ష్యం చాలా మందిలో కనిపిస్తుంది. కాసేపు అలా వచ్చి పోతాయిలే అనుకుంటారు. కానీ తిమ్మిర్లు ఎక్కువగా వస్తున్నాయంటే బాడీ మనకు కొన్ని సంకేతాలు ఇస్తున్నట్లే. స్టార్టింగ్ లోనే దీనిపై దృష్టి పెట్టకపోతే చాలా ఆరోగ్య సమస్యలు తప్పవు.
 
తిమ్మిర్లు ఎందుకొస్తాయి?
అసలు తిమ్మిర్లు ఎందుకొస్తాయి? ఈ విషయం చాలా మందికి తెలియదు. సరైన విటమిన్స్ బాడీకి అందకపోవటం కారణంగానే ఈ సమస్య ఉంటుంది. విటమిన్లలో చాలా రకాలు ఉంటాయి. ఎక్కువ మంది. విటమిన్ డీ, సీ, ఈ, ఎ వంటి వాటి మీద దృష్టి పెడతారు. కానీ మన బాడీకి మరో విటమిన్ అవసరం కీలకం. అదే బి 12. ప్రతి రోజు శరీరానికి బి12 అందించాలి. లేదంటే ప్రధానంగా తిమ్మిర్లు వస్తాయి.
 
అనేక సమస్యలు
విటమిన్ బి12 లేకపోతే ఒక్క తిమ్మిర్లు మాత్రమే కాదు. చాలా సమస్యలు ఉంటాయి. శరీరంలో మెటబాలిజం పెరగాలన్న, మెదడు ఆరోగ్యంగా ఉండాలన్న బీ 12 కీలకం. దీంతో నరాలు బలంగా తయారవుతాయి. రెడ్ బ్లడ్ సెల్స్ భారీగా పెరుగుతాయి. కావాల్సినంత బీ 12 లేకపోతే డిప్రెషన్, స్కిన్ సమస్యలు, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఐతే మన దేశంలో చాలా మంది బి12 డిపిషెన్సీపై దృష్టి పెట్టటం లేదు. దాదాపు 74 శాతం జనానికి కావాల్సినంత బి12 అందటం లేదు.
 
విటమిన్ బి-12 లో ఎందులో ఉంటది?
విటమిన్ బి-12 ముఖ్యంగా నాన్ వెజ్ లో ఎక్కువగా ఉంటుంది. బీఫ్, చికెన్, మటన్, ఎగ్స్, ఫిష్ లలో బి12 పుష్కలంగా లభిస్తుంది. పాలు, చీజ్ లాంటి వాటిలో కూడా బి12 ఉంటుంది. కచ్చితంగా రోజు మన ఫుడ్ లో ఇందులో ఏదో ఒక ఆహారాన్ని భాగం చేసుకోవాలి. లేదంటే సమస్యలు తప్పవు. బి12 తక్కువగా ఉంటే రక్త హీనత కూడా వస్తుంది. చాలా మంది బి12 సప్లిమెంట్ల కోసం టాబ్లెట్స్, ఇంజక్షన్స్ తీసుకుంటారు. కానీ ఫుడ్ ద్వారానే శరీరానికి దీన్ని అందించాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు