పరగడుపున స్వీట్లు, పంచదారతో చేసిన ఆహార పదార్థాలను తీసుకుంటే ఉదర సంబంధిత రుగ్మతలతో ఇబ్బందులు తప్పవని, అజీర్తి వెంటాడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే పరగడుపున ఎలాంటి పదార్థాలకు దూరంగా వుండాలో కూడా వైద్యులు చెప్తున్నారు. ముఖ్యంగా ఉదయం పూట అదీ పరగడుపున సిట్రస్ పండ్లను తీసుకోకూడదు.
ఉదయం పూట సిట్రస్ పండ్లను తీసుకుంటే అల్సర్, గ్యాస్ సంబంధిత ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉదయం పూట బలవర్ధకమైన ఆహారాన్ని, ఉడికించిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. ఇంకా కారం అధికంగా వుండే పదార్థాలను తీసుకోకూడదు.
ఇంకా నూనెలో వేయించిన పదార్థాలను తీసుకోకూడదు. ఇవి తీసుకుంటే ఛాతిలో మంట, ఉదర సంబంధిత రుగ్మతలను దూరం చేస్తుంది. కార్బోహైడ్రేడ్లు వున్న పానీయాలను తీసుకోవడం తగ్గించాలి. సోడా, కూల్ డ్రింక్స్‌ను ఉదయం పూట తీసుకోకూడదు. ఇకపోతే.. టమోటాలను కూడా పరగడుపున తీసుకోవడం చేయకూడదు. ఇందులో టానిక్ యాసిడ్ వుండటంతో పరగడుపున తీసుకోకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.