గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే.. గుండె ఆరోగ్యంగా వుంటుందట..

గురువారం, 27 జూన్ 2019 (11:30 IST)
మనిషి జీవించాలంటే గుండె ఆరోగ్యం పదిలంగా ఉండాలి. అలాంటి గుండెను మనం ఎల్లవేళలా కాపాడుకోవడం ఎంతో అవసరం. మంచి పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు వ్యాయామాలు కూడా చేస్తూ ఉండాలి. గోరు వెచ్చని నీరు గుండె ఆరోగ్యానికి మేలు చేకూరుస్తుంది. రెండుపూటలా గోరు వెచ్చటి నీరు శరీరం మీద పడితే శారీరక అలసటతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది.
 
కాబట్టి రోజూ చల్లటి నీటితో కాకుండా గోరు వెచ్చటి నీటిలో స్నానం చేయాలని చెబుతున్నారు నిపుణులు. పైగా గుండెకు రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. రక్తపోటు (బీపీ) అదుపులో ఉంటుంది. పరిశోధకులు సుమారు ఎనిమిది వందల మంది స్త్రీ పురుషుల మీద అధ్యయనం చేసి ఈ విషయాన్ని వెల్లడించారు. 
 
కొన్ని నెలల పాటు గోరువెచ్చని నీటితో స్నానం చేసిన వారి గుండె ఆరోగ్యంగా ఉన్నట్లు గుర్తించారు. స్నానానికి ఉపయోగించే నీరు చన్నీళ్లకంటే గోరువెచ్చని నీళ్లయితే గుండె పనితీరు మెరుగ్గా ఉంటుందని చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు