మెంతుల వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. మెంతులలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. దానితో పాటు విటమిన్-సి, బి1, బి2, కాల్షియం ఉంటాయి. దీనిలో క్యాలరీలు కూడా తక్కువే కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు వీటిని తీసుకోవచ్చు.
ఈ గింజలలో కొన్ని రకాల రసాయనాలు ఉంటాయి, గింజల్లోని జిగురు, చెడు రుచికి కారణం అదే. జీర్ణాశయం సంబంధ సమస్యలకు మెంతులు మంచి ఔషధం. స్థూలకాయం, చెడు కొలెస్ట్రాల్, మధుమేహం అదుపునకు ఇవి దోహదపడతాయి.