చలికాలంలో నువ్వుల ఉండల్ని తీసుకోవాల్సిందే.. లేకుంటే..?

ఆదివారం, 9 డిశెంబరు 2018 (16:42 IST)
శీతాకాలంలో నువ్వులను తప్పకుండా ఆహారంలో చేర్చుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. చలికాలంలో అనారోగ్య సమస్యలు తప్పవు. జలుబు, దగ్గు వంటి రుగ్మతల నుంచి తప్పించుకోవాలంటే.. నువ్వులను ఆహారంలో చేర్చుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చలికాలంలో నువ్వులను తీసుకోవడం ద్వారా శరీరానికి కావలసిన వేడి సమకూరుతుంది. 
 
అలాగే నువ్వుల ద్వారా శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. నువ్వుల్లో వుండే ఇనుము.. రక్తహీనతను దూరం చేస్తుంది. ఇంకా యాంటీ యాక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెను పదిలంగా వుంచుతుంది. 
 
నువ్వుల్లోని పీచు, జింక్, క్యాల్షియం, రక్తనాళాలు, ఎముకలు, కీళ్లను ఆరోగ్యంగా వుంచి జీర్ణక్రియను మెరుగపరుస్తుంది. నువ్వుల్లోని మెగ్నీషియం రక్తపోటును, మధుమేహాన్ని నియంత్రిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. అందుకే చలికాలంలో రోజుకు రెండేసి నువ్వుల వుండల్ని తినాలని వారు చెప్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు