మధుమేహం ఉన్నవారు సమతుల్య ఆహారంలో భాగంగా పుచ్చకాయను మితంగా తినవచ్చు, కానీ తినే మోతాదు, పరిమాణాలను గుర్తుంచుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి ప్రోటీన్ లేదా ఆరోగ్యకరమైన కొవ్వులతో జత చేయాలి. అప్పుడే పుచ్చకాయలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరంగా వుంటుంది.
పుచ్చకాయ హైడ్రేషన్‌కు మంచి మూలం, విటమిన్లు ఎ, సి, అలాగే లైకోపీన్, యాంటీఆక్సిడెంట్‌ను కలిగి ఉంటుంది.
పుచ్చకాయ రసంలో అధిక GI ఉంటుంది, కాబట్టి డయాబెటిస్ ఉంటే దీనిని సేవించరాదు.
తక్కువ GI ఉన్న ఇతర పండ్లలో ఆపిల్, చెర్రీస్, పీచెస్, రాస్ప్బెర్రీస్, ఆప్రికాట్లు, బేరి, ద్రాక్ష, నారింజ ఉన్నాయి.