బెండకాయల్లో ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇందులో విటమిన్ సి, బి3, బి9, పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్ వంటివి పుష్కలంగా ఉన్నాయి. అధిక ఫైబర్ కంటెంట్ కారణంగా రక్త కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. దీంతో గర్భధారణ సమయంలో మధుమేహం వచ్చే ప్రమాదాన్ని నివారించవచ్చు.