బిర్యానీలో ఉపయోగించే ఆకు వలన బిర్యానీకి ఒక రకమైన రుచి, వాసన వస్తాయి. బిర్యానీ ఆకులో విటమిన్ బి, పాంటోధెనిక్ ఆమ్లం, ఫైరాడిక్సిన్, రైబో ఫ్లేవిన్ అధికంగా లభిస్తాయి. శరీరంలోని ఎంజైముల పనితీరుని ఇవి మెరుగుపరుస్తాయి. నాడీవ్యవస్థ పనితీరు, జీవక్రియలను మెరుగుపరచడంలో బిర్యానీ ఆకు సహాయపడుతుంది.