రాత్రిపూట నిద్రపట్టడం లేదా.. తెల్లవారుజామును మెలకువ రావడం లేదా? అయితే మీలో జీవప్రక్రియకు సంబంధించిన గడియారం నిదానంగా పనిచేయడమే కారణం అని తాజా వైద్య పరిశోధనలు చెబుతున్నాయి. రాత్రిపూట పూర్తిగా నిద్రపట్టకపోయినా, తెల్లవారుజామున త్వరగా నిద్రలేవలేకపోయినా మీలో జన్యు ఉత్పరివర్తనే కారణం అంటున్నారు న్యూయార్క్ లోని రాక్ ఫెల్లర్ యూనివర్శిటీ పరిశోధకులు.
మానవ జీవ పక్రియను నిర్దేశించే శరీరంలో లోపలి గడియారం సకాలంలో పనిచేయలేక పోవడమే మనిషి నిద్ర, మెలకువ సైకిల్‌ను మార్చిపేస్తోందని రాక్ ఫెల్లర్ అధ్యయనం చెబుతోంది. సిఆర్‌వై1 అనే ప్రత్యేక జన్యువు ఈ జీవ ప్రక్రియ గడియారంలో దూరటం వల్లే మనకు నిద్రపట్టకపోవడం, ఉదయం త్వరగా నిద్రపట్టక పోవడం జరుగుతుంటుందని వీరు చెబుతున్నారు.
డీఎస్‌పీడి కారణంగా ప్రజలు రాత్రులు నిద్ర పోలేరు. కొన్న సార్లు చాలా ఆలస్యంగా నిద్రపడుతుంటుంది. దీనివల్ల సమాజానికి సంబంధించిన పనులు, ఉదయం చేయాల్సన పనులు వంటివాటికి వీరు దూరమై ఆందోళన, కుంగుబాటుకు గురవుతుంటారు. పైగా వీరికి గుండెజబ్బు, మదుమేహం కూడా కలిగే ప్రమాదం ఉందని పరిశోధకులు వ్యాఖ్య.