ఇతర నట్స్‌తో పోలిస్తే జీడిపప్పులో తక్కువ శాతం కొవ్వు ఉంటుంది. అంతేకాకుండా, గుండె ఆరోగ్యాన్ని పెంపొందించే 'ఒలిక్ ఆసిడ్' కూడా ఇందులో ఉంటుంది. కొవ్వు పదార్థాలను తక్కువగా, యాంటీ-ఆక్సిడెంట్‌లను కలిగి ఉండి గుండె సంబంధిత వ్యాధులు దూరమవుతాయి.
జీడిపప్పులో ఉన్న కాపర్ మూలకం క్యాన్సర్‌ను వ్యాప్తి చెందించే కారకాలకు వ్యతిరేకంగా పోరాడి, క్యాన్సర్ పెరుగుదలను నివారిస్తాయి. ముఖ్యంగా, కోలన్ క్యాన్సర్ పెరుగుదల నివారణలో జీడిపప్పు ముఖ్యపాత్ర పోషిస్తుంది. జీడిపప్పు వలన కలిగే ప్రయోజనాలలో ఇది ప్రత్యేకం అని చెప్పవచ్చు.
ఎముకల ఉపరితలంపై మెగ్నీషియం ఒక పూతల ఉండి, కండర కణాలలోకి కాల్షియం ప్రవేశాన్ని నిలిపి, రక్తనాళాలను, కండరాలను విశ్రాంతికి చేసూరుస్తుంది. అలాగే జుట్టు నల్లగా ఆరోగ్యకరంగా ఉండాలంటే కాపర్ అధికంగా గల జీడిపప్పును తినటం వలన పొందవచ్చు.
చిన్న వయస్సులోనే జుట్టు నెరిసేవారు జీడిపప్పు తినడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు. జీడిపప్పు ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలను అందిస్తుంది. జీడి పప్పు తినని వారితో పోలిస్తే, వారంలో రెండు సార్లు తినే వారు తక్కువ బరువు ఉంటారు.